నామా మాటేమిటని బాబును ప్రశ్నించిన తెరాస

కాగా, రైతు పోరు బాట నిర్వహిస్తున్న చంద్రబాబుపై తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ విరుకుచుపడ్డారు. వ్యవసాయం దండుగ ఆ రోజు చంద్రబాబు అన్నారని గుర్తు చేస్తూ ఆ మాటలన్నప్పుడు ఈనాడు దినపత్రికలో వచ్చిన కార్టూన్‌ను ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుకు ఆయన భార్య పల్లెంలో అన్నానికి బదులు కంప్యూటర్ వడ్డిస్తున్నట్లు అప్పట్లో కార్టూన్ వచ్చిందని ఆయన అన్నారు. చంద్రబాబు రైతుల కోసం కొట్లాడుతున్నట్లు ఢిల్లీకి వెళ్లి ఫోజులు కొట్టారని, చంద్రబాబు అప్పట్లో వ్యవసాయం దండుగ అని అన్నారని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆయన అన్నారు. యాభై రోజులుగా వర్షాలులేక పత్తి పంట ఎండిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో ప్రతి రోజూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆనయ అన్నారు. తెలంగాణలో కేవలం 456 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఎరువుల ధరలు పెంచింది కాంగ్రెసు ప్రభుత్వమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications