సిబిఐ విచారణ: చంద్రబాబును ఇరికించిన వైయస్ జగన్

ys jagan
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఇరికించారు. శుక్రవారం ఆయన సిబిఐ ముందు విచారణకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓఎంసి కేటాయింపులు చంద్రబాబు హయాంలోనే జరిగాయని చెబుతూ ఆయన మీడియాకు సాక్ష్యాలున్న కాపీని ఇచ్చారు. 1996 డిసెంబర్‌ 10న చంద్రబాబు రాంమోహన్ రెడ్డి అనే వ్యక్తికి 64.2 ఎకరాల భూమి కేటాయించారని ఆ తర్వాత ఆయనే 2002 ఫిబ్రవరి 18న కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన ఓఎంసికి ట్రాన్స్‌ఫర్ చేశారని ఆరోపించారు. బాబు తన అధికారాన్ని ఉపయోగించి ఈ ట్రాన్స్‌ఫర్ చేశారన్నారు.

ఓబుళాపురం కేటాయింపులు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరగలేదని బాబు హయాంలోనే జరిగాయన్నారు. ఈ ట్రాన్స్‌ఫర్ బాబు హయాంలో చట్టం రూపంలో చేసిందేనని ఈ కాపీ తాను అందరికీ ఇస్తున్నానని ఇప్పటికైనా ఆయన హయాంలోని అంశాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన మీడియాను కోరారు. ప్రధానంగా యెల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ మధ్యనే చేరిన టివి9 దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. వీరికి జర్నలిజం విలువలు ఉంటే ఇప్పటికైనా ఓఎంసిలోని అసలు విషయాన్ని బయటపెట్టారన్నారు. ఓబుళాపురం మైనింగ్ కేసును సిబిఐ అధికారులు ఏడాదిన్నరగా విచారిస్తున్నారని ఇన్ని రోజుల తర్వాత తనను పిలిచారంటే సాక్షిగానే పిలిచారన్నారు. సిబిఐకి తాను బాబు హయాంలోని జరిగిన కేటాయింపుల కాపీని ఇచ్చానన్నారు.

ఇటీవల హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఎలా విచారించారో తనను అలాగే విచారించారన్నారు. ఈ కేసులో ఓఎంసికి భూములు కేటాయించిన బాబును ఎందుకు ప్రశ్నించలేదని తాను సిబిఐని అడిగానన్నారు. అలాగే బాబును కూడా విచారించాలని అభ్యర్థించానని చెప్పారు. తనను అనవసరంగా ఈ కేసులో ఎందుకు ఇరికించారని కూడా వారిని అడిగానన్నారు. కాగా సిబిఐ అధికారులు జగన్‌ను సుమారు రెండున్నర గంటల పాటు విచారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+