వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చట్ట ప్రకారం చర్యలుంటాయి: ఫోర్జరీపై పురంధేశ్వరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandeswari
విశాఖపట్నం: తన కార్యాలయంలో జరిగిన సంతకం ఫోర్జరీపై చట్ట ప్రకారం చర్యలుంటాయని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ విద్యాసంస్థకు గ్రాంట్స్ విడుదల చేయడానికి అధికారిక లెటర్ హెడ్‌పై పురంధేశ్వరి పిఎ సంతకం ఫోర్జరీ చేసిన విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయం తన దృష్టికి వచ్చిందని, దానిపై తాను జులైలోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, దర్యాప్తు జరుగుతోందని, ఈ వ్యవహారంలో చట్టప్రకారం చర్యలుంటాయని ఆమె వివరించారు. విశాఖపట్నంలోని మారిటైమ్ విశ్వవిద్యాలయంలో ఎంటెక్ ఉత్తీర్ణులైన మొదటి బ్యాచ్ విద్యార్థులకు ఆమె సర్టిఫికెట్లు ప్రదానం చేయడానికి వచ్చిన ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

దేశ ఆర్థికాభివృద్ధిలో మారిటైమ్ సెక్టార్ ప్రధానమైన పాత్ర పోషిస్తుందని ఆమె సర్టిఫికెట్ల ప్రదానోత్సవ సభలో అన్నారు. దేశాన్ని సూపర్ పవర్‌గా తీర్చిదిద్దడానికి ప్రతి ప్రొఫెషనల్ పాత్ర ఉంటుందని ఆమె అన్నారు. మారిటైమ్ విద్య మేధో సంపత్తికి సంబంధించిందని, ఈ పరిశ్రమకు ఎనలేని భవిష్యత్తు ఉందని ఆమె అన్నారు. విద్యరంగంలో ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యం మంచిదని, అయితే అది పూర్తిగా వ్యాపార దృక్పథంతో సాగకూడదని ఆమె అన్నారు.

English summary
Union HRD minister D Purandeswari on forgery in her office said that action will be taken according to law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X