వైయస్ జగన్ అభిమానుల వీరంగం, లాఠీఛార్జ్

కార్యకర్తలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక అభిమాని కోఠి చౌరస్తాలోని హౌర్డింగ్ ఎక్కాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా సిబిఐ కార్యాలయానికి అమలాపురం పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ సందర్భంగా సబ్బం హరి మాట్లాడుతూ దోషులను పట్టుకునేందుకే సిబిఐ జగన్‌ను ప్రశ్నిస్తోందని చెప్పారు. ఓఎంసి కేసులో గతంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని విచారించారని ఇప్పుడు సమాచార సేకరణ కోసం జగన్‌ను విచారిస్తున్నారని అన్నారు. కాగా గంటన్నర నుండి సిబిఐ జగన్‌ను ప్రశ్నిస్తోంది.












Click it and Unblock the Notifications