మనిషి అనేవాడు వైయస్ జగన్‌లా ఉండడు: చంద్రబాబు

వైయస్ ప్రభుత్వ హయాంలో లాలూచీ పడ్డారని, అవినీతికి పాల్పడ్డారని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు. తన ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడలేదని, అందుకే ఏమీ చేయలేదని అందరికీ బాధగా ఉందని ఆయన అన్నారు. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ వ్యవహారంలో ఏ విధమైన తప్పు జరగలేదని ఆయన అన్నారు. అంతా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో ఒప్పందం తమ హయాంలో జరిగినా దాన్ని తిరగదోడి అక్రమాలకు వీలు కల్పించి అవినీతికి పాల్పడింది వైయస్ హయాంలోనే అని ఆయన అన్నారు. స్థలం కేటాయింపు, విల్లాల విక్రయం, మినహాయింపులు, ఎపిఐఐసి వాటా తగ్గింపు వంటివన్నీ వైయస్ హయాంలోనే జరిగాయని ఆయన ఆన్నారు. ఎమ్మార్ -ఎంజిఎఫ్ కంపెనీని స్థాపించి, ఎపిఐఐసి వాటా తగ్గించింది కూడా వైయస్ హయాంలోనే అని ఆయన అన్నారు. రహేజా విషయంలోనూ వైయస్ ప్రభుత్వం అదే రీతిలో వ్యవహరించిందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రచ్చబండ రచ్చరచ్చగా మారిందని ఆయన అన్నారు. కరవు ప్రాంతాలను ప్రకటించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించాలని తాను అంటే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎదురుదాడికి దిగుతున్నారని ఆయన అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడం చేత కాకపోతే చేత కాదని చెప్పాలని ఆయన అన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్ర ప్రభుత్వం 24 సార్లు పెంచిందని, దాని వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications