మరింత మంది ఐఎఎస్‌లను విచారించనున్న సిబిఐ

CBI
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ గనుల తవ్వకం కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుల్లో మరింత మంది ఐఎఎస్ అధికారులను సిబిఐ విచారించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సిబిఐ ముగ్గురు ఐఎఎస్ అధికారులపై దృష్టి పెట్టింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఎపిఐఐసి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన బిపి ఆచార్యను సిబిఐ ప్రథమ ముద్దాయిగా చేర్చింది. గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని విచారించింది. తాజాగా, జగన్ ఆస్తుల కేసులో శామ్యూల్‌ను సిబిఐ ప్రశ్నించింది. వీరు ముగ్గురు కూడా వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కీలకమైన పదవులు నిర్వహించినవారే. ఇదే తరహాలో మరింత మందిని విచారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

మూడు కేసుల్లోనూ నిబంధనల ఉల్లంఘన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ మూడు కేసులకు కూడా పరస్పర సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. వైయస్ హయాంలోని పెద్దల ప్రాపకంతో అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో శ్రీలక్ష్మిని తొలుత సాక్షిగా విచారించి, ఆ తర్వాత ముద్దాయిగా చేర్చారు. బిపి ఆచార్యను, శ్రీలక్ష్మిని కూడా సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో మరింత మంది ఐఎఎస్‌ల జాబితా సిబిఐ వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్‌కు ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లనే మినహాయింపులు ఇచ్చారా, మరే కారణంగానైనా ఇచ్చారా అనే విషయాన్ని తేల్చడానికి సిబిఐ మరికొంత మంది అధికారులను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+