ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: వైయస్ జగన్ జోస్యం

తమ పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ గెలుస్తుందని, ఈ విషయం చంద్రబాబుకు తెలుసునని, ఆ భయమే చంద్రబాబును వెంటాడుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకే మాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే బాధ్యతను నెరవేర్చడం లేదని ఆయన విమర్శించారు. ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు.
చంద్రబాబు రైతు వేషం చూసి ప్రజలు పగటి వేషగాడిని గుర్తు తెచ్చుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రెండున్నర ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎవరికైనా ఓటు వేయవచ్చునని చెప్పడం ద్వారా చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని బతికించదలుచుకున్నట్లు అర్థమవుతోందని ఆయన అన్నారు. దాదాపు వంద మంది శాసనసభ్యులు రాజీనామా చేస్తే రెండున్నరేళ్లు ప్రభుత్వం ఉంటుందని ఎలా చెబుతున్నారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications