గుజరాత్ అల్లర్ల కేసులో 31 మంది దోషులు

సర్దార్‌పురా అల్లర్ల కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక బృందం (సిట్) చేపట్టింది. ఈ కేసులోనే బుధవారం తీర్పు వెలువడింది. పలువురు శరణు పొందిన సర్దార్‌పురా గ్రామంలోని ఇబ్రాహిం షేక్ అనే వ్యక్తి ఇంటికి 2002 ఫిబ్రవరి 28వ తేదీన అల్లరి మూకలు నిప్పు పెట్టాయి. ఈ ఘటనలో మొత్తం 33 మంది మరణించారు. మృతుల్లో 20 మంది మహిళలు ఉన్నారు. ఈ కేసులో 76 మంది నిందితులను అరెస్టు చేశారు. ట్రయల్ పెండింగులో ఉన్న సమయంలో ఇద్దరు మరణించారు. ఒక్కరిపై జువైనైల్ కోర్టులో విచారణ జరుగుతోంది. మొత్తం 73 మందిపై అభియోగాలు మోపి 2009 జూన్‌లో విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications