మార్పు తేలేం: రాజకీయాలపై జయసుధ వైరాగ్యం

మానవ హక్కుల వాళ్లు వచ్చి వాళ్లకి మద్దతు పలుకుతారు. ఇండియా అంటే ఇదే. ప్రజల మనసులు కరప్ట్ అయ్యుంటే వాళ్లని మనం సరిచేయట్లేదు. నాలాంటి జయసుధలు ఎంతమందొచ్చినా వాళ్లలో మార్పు తీసుకురాలేరు. పేదవారికి మంచి ఇళ్లు కట్టించి స్లమ్‌లనేవి లేకుండా చేయగలిగితే అప్పుడు మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. రాజకీయాల గురించి ఆలోచించడం కూడా అనవసరమని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రపంచం ఎందుకిలా ఉందనే బాధ తనను వేధిస్తోందనీ, అక్కడ ఒకదానికే ఎన్నో అర్థాలుంటాయన్నారు. నా అంతట నేనుగా రాజకీయాల్లోకి వెళ్లలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. సినీ పరిశ్రమ వాళ్లు తప్ప బయటివాళ్లు నాకంతగా తెలీదు. రిజర్వుడ్‌గా ఉంటాను. అలాంటిది నేనుగా వెళ్లి అడిగే ఆసక్తి లేదు.
నాకు సామాజిక సేవ అంటే ఆసక్తి కాబట్టి ఇందులోకి వస్తే చేయొచ్చని వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు. పేదవాళ్ల కోసమని పెట్టిన ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా ఇంకేమన్నా చేయగలమా అనిపించి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి, వాళ్లు బాగుండాలి, పేదరికం అన్నది లేకుండా చేయాలి అనేది నా తపన అన్నారు. మనమెప్పుడూ ప్రభుత్వం ఏమిస్తుందా, ఏమిస్తుందా అని బిచ్చగాళ్లలాగే ఉంటాం, గవర్నమెంట్‌కి మనమేమిస్తున్నాం అని ఎవరూ ఆలోచించమని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో 65 బస్తీలున్నాయి. హైటెక్ సిటీ అనీ, ఇంకోటనీ హైదరాబాద్ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ డ్రైనేజీ పొంగిపోయి అపరిశుభ్రంగా కనిపించే బస్తీలెన్నో. అక్కడివారికి మరుగుదొడ్లు కూడా లేవు. ఆడవాళ్లకి కనీస సౌకర్యాలు కూడా లేని అలాంటి ప్రాంతాలు నగరం మధ్యలోనే ఎన్నో ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే నేను చేయగలనని ఏం చెప్పగలను, చేస్తామనేది ఉత్త మాటేనన్నారు. ప్రయత్నిస్తున్నా కానీ ఇక్కడ ఏం చేయలేం. మన దేశమే అలా ఉందని నిస్సాహయత వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications