విరమణ కాదు విరామం, ఆజాద్ హామీతోనే: కోమటిరెడ్డి

తెలంగాణపై త్వరలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేస్తుందని ఆజాద్ హామీ ఇచ్చినందువల్లే దీక్ష విరమిస్తున్నట్లు చెప్పారు. ఆజాద్, ఎంపీల కోరిక మేరకే దీక్షను విరమించినట్లు చెప్పారు. కేంద్ర నాయకత్వం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే తాను దీక్షను చేపట్టానన్నారు. కాగా కోమటిరెడ్డి దీక్షా విరమణకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు స్వామి గౌడ్, శ్రీనివాస్, ఎంపీలు కె కేశవ రావు, మందా జగన్నాథం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. దీక్ష ముగిసిన అనంతరం కోమటిరెడ్డికి వైద్యులు పరీక్షలు చేశారు.












Click it and Unblock the Notifications