పోలీస్‌స్టేషన్‌లో బెంగాల్ ముఖ్యమంత్రి మమత హల్ చల్!

సోమవారం రాత్రి రాత్రి కోల్‌కతాలోని ఓ పోలీస్ స్టేషన్‌కి మమత వెళ్లారు. ఓ గొడవ కేసులో అరెస్టయిన తన పార్టీ కార్యకర్తలను విడుదల చేయించుకుని వెళ్లిపోయారు. జగద్ధాత్రి నిమజ్జనం సందర్భంగా రెండు గ్రూపుల మధ్య గొడవ అయింది. కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు పోలీసులు వారిని ముందుకు సాగాలని సూచించారు. అలాగే డిజి సౌండ్ కూడా తగ్గించాలని సూచించారట. పోలీసుల సూచనలను వారి ఏమాత్రం పట్టించుకోకుండా ఇరువర్గాలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన గొడవలో పోలీసులు ఇద్దరు టిఎంసి కార్యకర్తలను అరెస్టు చేశారు.
వారిని అదుపులోకి తీసుకున్న సమయంలోనే మాకు చాలా కాంటాక్టులు ఉన్నాయని వారు పోలీసులను హెచ్చరించారట. దాడిలో పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. అయితే ఆ తర్వాత అరెస్టైన తమ కార్యకర్తలను సిఎం స్వయంగా పోలీసు స్టేషన్ వచ్చి విడిపించుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications