ఒత్తిడి చేసి విలువ కట్టించారు: జగన్ సంస్థపై సుదర్శన్

ఎక్కువ మొత్తాలకు అంచనా వేసిన డెలాయిట్ నివేదికను ముందు పెట్టి జగతి పబ్లికేషన్స్ వాటాలను విక్రయించినట్లు అర్థమవుతోంది. ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి చానెల్ వార్తాకథనం ప్రకారం - జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్‌ఫ్రా గరిష్ట విలువ 410 కోట్ల రూపాయలు మాత్రమే. జగతి పబ్లికేషన్స్ మూలధనం విలువను 3,500 కోట్ల రూపాయలుగా అంచనా కట్టారు. దీని ఆధారంగానే వాటాలను విక్రయించారు. చెన్నైకి జగదీషస్ అండ్ కంపెనీ అంచనా ప్రకారం జగతి పబ్లికేషన్స్ షేర్ విలువ 30 రూపాయలు ఉంటుంది. కానీ జగతి పబ్లికేషన్స్ ఒక్కో షేర్ విలువను 350 రూపాయలుగా లెక్క కట్టి ఈక్విటీ షేర్లను విక్రయించింది. బడా పెట్టుబడిదారులు అంతకన్నా ఎక్కువ ధరకు వాటాలు కొనుగోలు చేశారు.












Click it and Unblock the Notifications