తెలుగులో జివో జారీ చేసిన 'తమిళ' అధికారి రాధా

ఈ జివో కోసం తాము సుమారు పదకొండు నెలలు కష్టపడ్డామని అధికారి రాధ చెప్పారు. సిబ్బందికి తెలుగు టైపింగ్ నేర్పించామని, అందరూ నేర్చుకోవాలని సూచించినట్లు చెప్పారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాను జివోను తెలుగులే జారీ చేసినట్లు చెప్పారు. దేశంలో చాలా రాష్ట్రాలు మాతృభాషలో ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈ అలవాటు లేదు. అంతా ఇంగ్లీషులోనే. అయితే రాధ మాత్రం అందరికీ భిన్నంగా చేసి సంచలనం సృష్టించారు. మాతృభాషను అభిమానించాలని మిగిలిన అధికారులకు చెప్పకనే చెప్పారనుకోవచ్చు.












Click it and Unblock the Notifications