ముహూర్తం 11, కెసిఆర్‌ను కలిసిన టిడిపి ఎమ్మెల్యేలు

కాగా మరికొందరు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వీరి బాటలోనే పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపి నుండి టిఆర్ఎస్‌లో చేరగా నాగం గ్రూపు పార్టీ నుండి బయటకు వెళ్లి సొంతగా ఉద్యమిస్తోంది. బాబు రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉందని భావించిన పలువురు టిడిపి ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లుగా కనిపిస్తోంది. కాగా బాబు వైఖరి ఇలాగే ఉంటే తెలంగాణలో టిడిపి ఖాళీ కావడం ఖాయమని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.
అయితే తాను టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను హనుమంత్ షిండే ఖండించారు. తాను పార్టీ మారాలనుకుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటే వెళ్లే వాడినన్నారు. తమపై అవాస్తవ కథనాలు తీసుకు రావద్దని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications