తెలంగాణపై కీలక ప్రకటన: ఢిల్లీకి బొత్స సత్యనారాయణ

తెలంగాణపై ప్రకటన చేయడానికి ముందు బొత్సతో పార్టీ అధిష్టానం చర్చలు జరపాలని అనుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితిపై, ప్రకటన చేసిన తర్వాత సంభవించబోయే పరిణామాలపై పార్టీ అధిష్టానం పెద్దలు బొత్స అభిప్రాయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించని సీమాంధ్ర నాయకుడిగా బొత్స సత్యనారాయణ చెప్పే అభిప్రాయాలు తటస్థంగా, వాస్తవానికి దగ్గరగా ఉంటాయని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమరణ నిరాహారదీక్షను విరమింపజేయడానికి అనుసరించాల్సిన వైఖరిని కూడా అధిష్టానం పెద్దలు బొత్స సత్యనారాయణతో మాట్లాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications