తెలంగాణ వస్తుందని తేలింది: టి- కాంగ్రెసు ఎంపీలు

K Keshav Rao-Komatireddy Rajagopal Reddy
హైదరాబాద్: కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలతో తెలంగాణ వస్తుందని తేలిపోయిందని భువనగిరి శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం అన్నారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి దీక్షను విరమింప చేసేందుకు టి-కాంగ్రెసు ఎంపీలు కెకె, గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెసు ఎంపీలు మాట్లాడారు. మరో మూడ్రోజుల్లో తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన హామీ వచ్చే అవకాశముందన్నారు. ఒకవేళ స్పష్టమైన ప్రకటన వెలువడకపోతే పార్లమెంటు సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే విషయాన్ని చర్చించి నిర్ణయిస్తామన్నారు.

రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు. ఆజాద్ తాజా ప్రకటన రాష్ట్రం ఏర్పాటుపై నమ్మకం కలిగిస్తోందని, మీడియా వార్తలతో తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణ కోసం పదవులు వదులుకునేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఆజాద్ ప్రకటన చేస్తామన్నారు కాబట్టే తాము ఆయనతో దీక్షను విరమింప చేశామన్నారు. కోమటిరెడ్డిని తెలంగాణ నేతలెవరూ పరామర్శించడానికి రాకపోవడాన్ని కోదండరాం ఖండించారు. అర్హత లేని వారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారన్నారు. జెఏసి సమావేశం ఏర్పాటు చేసి త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఒకరిద్దరు మినహా మంత్రులు కోమటిరెడ్డిని పరామర్శించక పోవడం ఏమిటన్నారు. తెలంగాణ కోసం దీక్ష చేయడమే తప్పా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+