చెన్నైలో పద్మనాభ స్వామి తరహా రహస్య సంపద

Secret temple vault in Chennai
చెన్నై: కేరళలోని తిరువనంతపురం శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగల్లోని సంపద తరహా సంపద చెన్నైలోని ఓ దేవాలయంలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీపద్మనాభ స్వామి ఆలయంలో కళ్లు మిరుమిట్లు గొలిపే సంపద బయటపడిన తర్వాత దేశంలోని పలు ఆలయాల్లో అటువంటి నేలమాళిగలు ఉండవచ్చుననే అంచనాలు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, చెన్నైలోని చంద్రశేఖర స్వామి ఆలయంలో అంతులేని సంపద నేలమాళిగల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

చెన్నైలోని ఆ ఆలయం దాదాపు 1200 ఏళ్లనాటిది. ఇది న్యూ గుమ్మిడిపూడికి సమీపంలో ఉంది. ప్రాచీన కాలంనాటి నుంచి నేలమాళిగల్లో దాచిన సంపద చంద్రశేఖర స్వామి ఆలంయలో ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇది భక్తుల్లోనూ, ఆలయ అధికారుల్లోనూ ఆసక్తిని రేపింది. దీంతో హిందూ మత, చారిటబుల్ దేవాదాయ శాఖ అధికారులు ఆరడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవు గల సొరంగాన్ని తెరవాలని నిర్ణయించారు. దీన్ని ఈ నెల 16వ తేదీన తెరిచే అవకాశం ఉంది.

చంద్రశేఖర స్వామి ఆలయం చోళ, పాండ్య పాలకుల శిల్పా కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. డిసెంబర్ 1వ తేదీన జరిగే కుంభాభిషేకం కోసం ఆలయం మరమ్మత్తులు చేపట్టినప్పుడు కోశాగారానికి సంబంధించిన అనుమానాలు తలెత్తాయని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పద్మనాభన్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+