సమావేశాల కంటే ముందే తెలంగాణ, ఐనప్పటికీ: బొత్స

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకంటే ముందే కేంద్రం తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం చెప్పారు. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితులను ఆజాద్‌కు వివరించానని చెప్పారు. తెలంగాణపై కేంద్రం, పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామన్నారు. సమావేశాల కంటే ముందే తెలంగాణ నిర్ణయం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఐనప్పటికీ తొందరపడి తీసుకోకూడదన్నదే పార్టీ అభిప్రాయమన్నారు. రాష్ట్ర సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణపై ప్రజలందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందన్నారు.

తెలంగాణ అంశం తేలే వరకు రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు ఉండదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ఇష్ట ప్రకారమే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. పిసిసి అధ్యక్షుడిగా తనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవన్నారు. ప్రజారాజ్యం పార్టీ నుండి వచ్చిన వారిలో సమర్థులైన వారిని పార్టీ కోసం వినియోగించుకుంటామన్నారు. అసెంబ్లీలో తమ ప్రభుత్వానికి బల నిరూపణ అవసరం లేదని విశ్వాసం లేని వారెవరైనా ఉంటే అవిశ్వాసం పెట్టుకోవచ్చునన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+