తెలంగాణ సస్పెన్స్‌కు తెర, సెషన్స్‌కు ముందే ప్రకటన?

Telangana
న్యూఢిల్లీ: ఈ నెల 22వ తేది నుండి పార్లమెంటు సమావేశాలు ఉండటంతో ఆ లోగానే తెలంగాణ అంశాన్ని తేల్చేయాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ అంశంపై త్వరలో తేల్చుతామని ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వస్తున్న పెద్దలు ఈ వారం రోజుల్లో ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిగ్విజయ్ సింగ్, రషీద్ అల్వీ చెప్పినట్లుగా తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేసే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని సమాచారం. వారు చెప్పింది కేవలం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశించి మాత్రమే అనే తెలంగాణ కాంగ్రెసు నేతలు కూడా చెబుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ సూచించిన 4, 5, 6 సిఫారసుల ఆధారంగా తెలంగాణపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, రెండు ప్రాంతాలకూ వేర్వేరు రాజధానులను ప్రకటించడమా? లేక హైదరాబాద్‌ను ప్రస్తుతానికి ఉమ్మడి రాజధానిగా నిర్ణయించి ఆ తరువాత సీమాంధ్రకు వేరే రాజధానిని ప్రకటించడమా? అన్న రెండు మార్గాలే కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది.

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వదేశానికి శనివారం తిరిగి రానున్నారు. ఆయన రాగానే తెలంగాణపై కదలికలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీతో గురువారం భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై వారి చర్చలు కేంద్రీకృతమైనప్పటికీ ఏ దిశగా నిర్ణయం తీసుకుంటారనే విషయంపై బొత్సకు చెప్పలేదని తెలుస్తోంది. అయితే ఆజాద్‌తో శుక్రవారం భేటీ అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. రెండో ఎస్సార్సీ వేస్తామని తాము చెప్పింది యుపిని దృష్టిలో పెట్టుకొని కానీ తెలంగాణపై కాదు అని ఏఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ కాంగ్రెసు సీనియర్ నేత కె కేశవరావుతో స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు ప్రణబ్‌ను కలిసే ముందు కెకె బొత్సతో మంతనాలు జరిపారు. శ్రీకృష్ణ కమిటీ సూచించి మూడు ప్రతిపాదనల పట్ల కోర్ కమిటీ దృష్టి సారిస్తున్నప్పటికీ అదే కమిటీ సూచించిన ప్రాంతీయ మండలి పట్ల మాత్రం విముఖతతో ఉన్నట్లుగా సమాచారం. ప్రాంతీయ మండలి వల్ల కాంగ్రెసుకు రాజకీయంగా మరింత నష్టం కలుగుతుందని వారు భావిస్తున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+