రైలు నుంచి తోసేసి రేప్ చేసిన వ్యక్తికి మరణ శిక్ష

తమిళనాడులో విరుదాచలానికి చెందిన 30 ఏల్ల గోవిందచామి అనే బిక్షగాడు 23 ఏల్ల సౌమ్య అనే అమ్మాయిపై ఆ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కొచ్చిలోని మాల్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న సౌమ్య కొచ్చి - షోర్నూర్ ప్యాసెంజర్ రైల్లో ఖాళీగా ఉన్న లేడీస్ కంపార్టుమెంటులో ప్రయాణిస్తుండగా గోవిందచామి ప్రవేశించి ఆ దారుణానికి ఒడిగట్టాడు. గాయపడిన సౌమ్యను రేప్ చేసి ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఆమెను ఆస్పత్రిలో చేర్చగా ఫిబ్రవరి 6వ తేదీన మరణించింది. గోవిందచామికి నేరచరిత్ర ఉంది. తమిళనాడులో ఎనిమిది కేసుల్లో అతను దోషిగా తేలాడు.












Click it and Unblock the Notifications