కెసిఆర్‌కు పోలవరం బహుమతి, జగన్‌తో లింకు: ఎర్రబెల్లి

పోలవరం అక్రమాలలో ముఖ్యమంత్రి కార్యాలయం పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఆయన స్పందించకుంటే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని అవసరమైతే కోర్టుకు వెళతామన్నారు. పదేళ్లుగా కాంగ్రెసుకు కష్టం వచ్చినప్పుడల్లా కెసిఆర్ ఆదుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కు అయిందెవరో త్వరలో బయటపడుతుందన్నారు. అవసరమైతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామన్నారు. టెండర్ల అక్రమాలలో టిఆర్ఎస్, కాంగ్రెసు స్పందించనందునే గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications