లంచాలు పెట్టుబడులుగా జగన్ సంస్థల్లోకి: రేవంత్ రెడ్డి

తాము అవినీతిని ప్రశ్నిస్తుంటే ఎదురు దాడికి దిగుతున్నారని, తమ పార్టీపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో సంపదను దోపిడీ చేశారని ఆయన అన్నారు. 2010లో ఆదాయం పన్ను శాఖ ఇచ్చిన నోటీసులు కూడా జగన్ వ్యవహారాన్ని బయటపెడుతుందని ఆయన అన్నారు. జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ వాస్తవ విలువ 184 కోట్ల రూపాయలే కాగా, దాన్ని 3500 కోట్ల రూపాయలుగా చూపించి, 1246 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టారని, వైయస్ ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందినవారే ఆ పెట్టుబడులు పెట్టారని ఆయన అన్నారు. జగన్ అవినీతికి సంబంధించి ఆధారాలను తాము సిబిఐకి ఇస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications