తెలంగాణపై దిక్కుతోచని స్థితిలో సోనియా గాంధీ

జాతీయ పార్టీలతో, యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపిన తర్వాతనే తెలంగాణపై నిర్ణయాన్ని వెల్లడిస్తామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ శుక్రవారం చెప్పి, తెలంగాణపై వెనక్కి తగ్గుతున్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. రెండో ఎస్సార్సీకి సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత రావడం కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గడానికి కారణమని అంటున్నారు. అధిష్టానానికి వీరవిధేయుడైన సర్వే సత్యనారాయణ కూడా తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయం కుదరదని, రెండో ఎస్సార్సీకి అంగీకరించేది లేదని అన్నారు. తెలంగాణ పార్టీ నాయకులను ఒప్పించడం కాంగ్రెసు అధిష్టానానికి పెద్ద సమస్యగా మారింది.
తమ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు అంగీకరిస్తే పార్టీ అధిష్టానానికి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఫరవా లేదు. తెలంగాణలో పెల్లుబుకే ఆందోళనల విషయంలో అనుసరించాల్సిన పద్ధతి ఏమిటో ఇప్పటికే ఓ నిర్ధారణకు వచ్చిన కాంగ్రెసు అధిష్టానం తమ పార్టీ నాయకుల వద్దే ఆగిపోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి, తెలంగాణపై రెండు మూడు రోజుల్లో వెలువడుతుందని భావిస్తుండడం వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి వలసలు ఆగిపోయినట్లు చెబుతున్నారు. మళ్లీ వలసలు ఊసు పైకి వచ్చే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications