జగన్ కేసు: డెలాయిట్‌కు విజయసాయి రెడ్డి సవాల్

Sakshi Logo
హైదరాబాద్: తమ కంపెనీ అంచనాలకు సంబంధించి డెలాయిట్ కంపెనీ సీనియర్ డైరెక్టర్‌ సుదర్శన్‌తో ముఖాముఖికి సిద్ధమని సాక్షి దినపత్రిక వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి సవాల్ చేశారు. డెలాయిట్ కంపెనీ అంచనాలపై ఆయన శుక్రవారం సిబిఐకి ఓ లేఖ రాశారు. సాక్షిపై కక్ష కట్టిన పత్రికల్లో వస్తున్న కథనాలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. డెలాయిట్ అంచనాల వ్యవహారంపై వాస్తవాలను నిగ్గు తేలుస్తామని ఆయన అన్నారు. కొందరు వ్యక్తుల ఒత్తిడికి తలొగ్గి సుదర్శన్ వాంగ్మూలం ఇచ్చినట్లు అర్థమవుతోందని ఆయన అన్నారు

సుదర్శన్ సమక్షంలో అతని వాదన తప్పని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఎల్లో మీడియా ప్రచారాన్ని తిప్పికొట్టడానికి సిబిఐకి రాసిన లేఖను బహిరంగపరిచినట్లు ఆయన తెలిపారు. మెజిస్ట్రేట్ ముందు ఇచ్చినట్లు చెబుతున్న సుదర్శన్ వాంగ్మూలాన్ని తనకు ఇవ్వకుండానే తమను వ్యతిరేకించేవారికి ఎలా చేరిందని ఆయన అడిగారు. ఇదే డెలాయిట్ సుదర్శన్ 1800 కోట్ల రూపాయన నష్టాల్లో ఉన్న ఈనాడును విలువ కట్టిందని ఆయన చెప్పారు.

డెలాయిట్ నివేదికకు, సాక్షిలో పెట్టుబడుల రాకకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సాక్షిలోకి పెట్టుబడులు ఆగస్టు 2007 నుంచే వచ్చాయని, డెలాయిట్ నివేదిక నవంబర్‌లో వచ్చిందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+