ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను ప్రశ్నించిన జగన్ పార్టీ నేత

Jupudi Prabhakar Rao
హైదరాబాద్: మూతపడిన ఓ పత్రికను ఓ మామూలు విలేకరి కోట్ల రూపాయలతో ఎలా ప్రారంభించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణను ఉద్దేశించి ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న రామోజీరావు సంస్థ ఈనాడు షేర్లను ఎక్కువ ధరకు విక్రయించవచ్చు గానీ కొత్తగా పెట్టిన సాక్షి పత్రిక షేర్‌ను ఎక్కువ ధరకు అమ్మకూడదా అని ఆయన అడిగారు. ఈనాడు మిషనరీ అంతా స్క్రాప్ అని, సాక్షి యంత్రపరికరాలన్నీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినవని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి సవాల్‌ను సిబిఐ స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. డెలాయిట్ సీనియర్ డైరెక్టర్ సుదర్శన్, విజయసాయి రెడ్డిలను ఒక్క చోట కూర్చోబెట్టి సిబిఐ ప్రశ్నించగలదా అని ఆయన ప్రశ్నించారు. సిబిఐ వ్యవహారశైలిని ఆయన తప్పు పట్టారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి జేబు సంస్థగా సిబిఐ మారడాన్ని తాము అంగీకరించబోమని ఆయన అన్నారు.

ఏ శాఖలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయో ఆ శాఖకు చెందిన మంత్రులను, కార్యదర్శులను సిబిఐ ప్రశ్నించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈనాడు, ఆంధ్రజ్యోతికి చెందినవారు పొంతనలేని ఆరోపణలను జగన్‌పై చేస్తున్నారని, పదే పదే తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన జగన్‌ను ఏమీ చేయలేరని ఆయన అన్నారు. ఎల్లో మీడియా కుట్రపూరితమైన ప్రచారానికి తెర దించాలని ఆయన ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలను ఉద్దేశించి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+