తెలంగాణ ఇప్పుడైతే ఇవ్వలేం: తేల్చేసిన ప్రధాని

వెంటనే తెలంగాణ ఇచ్చేయలేమని, విస్తృత ఏకాభిప్రాయం సాధించకుండా నిర్ణయాలు తీసుకుంటే పెనం మీది నుంచి పొయ్యిలోకి పడినట్లేనని ఆయన అన్నారు. తెలంగాణపై ఇప్పుడే చెప్పలేమని, కొన్ని ప్రాథమిక చర్చలు జరిగాయని, కానీ విస్తృత ఏకాభిప్రాయం సాధించామని చెప్పలేమని, ఇంకా కొంత దూరంలో ఉన్నామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లో అశాంతి నెలకొని ఉండగా తెలంగాణకు అంగీకరించడ సమస్యకు పరిష్కారం కాదని ఆయన అన్నారు సంబంధీకులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి సర్వామోద పరిష్కారానికి అంగీకరింపజేసేందుకు ఆచరణీయ మార్గాలను ఇప్పటికీ అన్వేషిస్తున్నామని ఆయన అన్నారు.
తెలంగాణపై ప్రధాని ప్రకటన చేసిన నేపథ్యంలో తదుపరి చర్యగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనున్నట్లు తెలిసింది. ఈనెల 22న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బహుశా 21న సీడబ్ల్యూసీ భేటీ ఏర్పాటు చేస్తారని, దీనికి ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానిస్తారని తెలిసింది. అదేవిధంగా యూపీఏ మిత్రపక్షాలతోనూ భేటీ జరపొచ్చని తెలిసింది. తెలంగాణతో సహా అనేక అంశాలపై మిత్రపక్షాలతో చర్చించే అవకాశముంది.












Click it and Unblock the Notifications