రాజీనామాలపై జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో ఆందోళన

ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తు, ఈడి నోటీసులు జారీ చేయడం తదితరాలు జగన్ ఎదుర్కొంటున్న ప్రస్తుతం పరిస్థితుల్లో తమ రాజీనామాలు ఆమోదిస్తే ఎన్నికలలో తమకు ఎదురుదెబ్బ తగల వచ్చని వారు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జగన్‌తో వెళ్లిన తమ ఎమ్మెల్యేలు తిరిగి తమ గూటికి వస్తారనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెసు ఇంతకాలం వారి రాజీనామాలు ఆమోదించలేదని ఇప్పుడు వచ్చే వారెవరో జగన్‌తో ఉండే వారెవరో అంతర్గతంగా తేలిపోయినందునే రాజీనామాల ఆమోదం ప్రక్రియను ప్రారంభించినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
జగన్ కోసం రాజీనామా సమర్పించిన ఎమ్మెల్యేల్లో కాంగ్రెసు వారే 26 మంది వరకు ఉన్నారు. వీరిలో అత్యధిక ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు అంగీకరించాల్సిందిగా స్పీకర్‌ను కోరే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమోదం పొందే పరిస్థితి వస్తే చాలామంది వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాము తిరిగి వచ్చినా రాకున్నా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేనందున, జగన్ పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించనందున తిరిగి కాంగ్రెసులోనే కొనసాగటం మంచిదని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications