బాబు పాదయాత్రకు బ్రేక్, విచారణపై మంతనాలు

కాగా అంతకుముందు ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పేదలకు ఇళ్లు లేకున్నప్పటికీ కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని చంద్రబాబు విమర్శించారు. బొత్స కుటుంబం పూర్తి అవినీతిలో కూరుకు పోయిందని ధ్వజమెత్తారు.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం లాభసాటి కావాలని, అందుకు స్వామి నాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు అజెండా జాతీయ అజెండాగా మారాలని ఆకాంక్షిచారు. వ్యవసాయంలో 50 శాతం లాభాలు వస్తేనే రైతుకు మనుగడ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయికి కిలో బియ్యంతో వ్యక్తికి కేవలం రూ.4 లబ్ధి చేకూరుతోందన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నా నియంత్రించలేని చేతగాని ప్రభుత్వమని విమర్శించారు.












Click it and Unblock the Notifications