బాబు ఆస్తులపై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశం

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆస్తులపై హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ హైకోర్టు సోమవారం ఆ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వైయస్ విజయమ్మ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆస్తులపై ప్రాథమిక విచారణ జరిపి మూడు నెలల్లో సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. చంద్రబాబు ఆస్తుల వ్యవహారంపై విచారణ జరపాలని హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెబీలను కూడా హైకోర్టు ఆదేశించింది.

చంద్రబాబు ఇటీవల ప్రకటించిన ఆస్తులు తప్పుల తడక అని విజయమ్మ తన పిటిషన్‌లో ఆరోపించారు. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో చంద్రబాబు విపరీతంగా ఆస్తులు కూడబెట్టారని, అందుకు అక్రమాలకు పాల్పడ్డారని ఆమె అన్నారు. హైకోర్టు ఆదేశాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విచారణకు తాము భయపడేది లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రంనాయుడు అన్నారు. గతంలో వైయస్ ప్రభుత్వం వేసిన విచారణలు ఏవీ చంద్రబాబుపై ఆరోపణలను నిరూపించలేకపోయాయని ఆయన అన్నారు. వైయస్ జగన్‌పై జరుగుతున్న విచారణను తప్పుదోవ పట్టించడానికి వైయస్ విజయమ్మ చంద్రబాబుపై ఆ పిటిషన్ వేశారని ఆయన అన్నారు. వైయస్ కోర్టులో పిటిషన్ వేసి ఉపసంహరించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+