ఇండియాకి 155మిలియన్ డాలర్ల అధీకృత ధనం..

ఇండియా మొత్తం మీద 'ఏసెల్ పాట్నర్స్' 34 కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇక 'ఏసెల్ పాట్నర్స్' విషయానికి వస్తే 1983లో ప్రారంభించడం జరిగింది. 'ఏసెల్ పాట్నర్స్'లలో ప్రముఖ కంపెనీలు డ్రాప్ బాక్స్, ఫేస్‌బుక్, గ్రూపాన్, కయాక్, మాడ్‌క్లోత్, స్పోటిపై లాంటివి కేటిగిలకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. అదే ఇండియా విషయానికి వస్తే ఇంటర్నెట్ కంపెనీలైన ప్లిఫ్‌కార్ట్, మైంత్రా, లెట్స్‌బై, హెల్త్ కేర్ మ్యాజిక్, సుబ్రతా మిత్రా లాంటివి భాగస్వాములుగా ఉన్నారు.
ఇండియాకు సంబంధించిన పదకొండు మంది పెట్టుబడిదారులు ఇందులో పాట్నర్స్‌గా కొనసాగుతున్నారు. వారిలో మనం ముఖ్యంగా చూసినట్లైతే మహేంద్రన్ బాలచంద్రన్, శేఖర్ కిరానీ, సుబ్రతా మిత్రా, ప్రశాంత్ ప్రకాష్ మొదలగున వారు ముఖ్యులు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈక్విటీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్న పెట్టుబడిదారులలో 'ఏసెల్ పాట్నర్స్' ఒకటి. ఇటీవలే 'ఏసెల్ పాట్నర్స్' అమెరికా, జర్మనీ, ప్రాన్స్, ఫిల్ ల్యాండ్, రష్యా, చైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ లాంటి దేశాలలో పెట్టుబడులు పెట్టడం జరిగింది.












Click it and Unblock the Notifications