గాలి ఆస్తుల విలువ రూ. 1500 కోట్లు, గుర్తించిన సిబిఐ

సిబిఐ అధికారుల సమాచారం మేరకు గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు హుస్సేన్ పీరాను బళ్లారి పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గాలి జనార్దన్ రెడ్డి రెండు పాస్‌పోర్టులున్నట్లు ఈ సందర్భంగా వెల్లడైంది. దీంతో గాలి జనార్దన్ రెడ్డిపై బళ్లారిలో మరో కేసు నమోదైంది. గాలి జనార్దన్ రెడ్డి ఆదాయం పన్ను శాఖకు రూ. 123 కోట్లు బకాయి ఉన్నట్లు సమాచారం. దాన్ని వసూలు చేసుకోవడానికే ఆదాయం పన్ను శాఖ సిబిఐ స్వాధీనం చేసుకున్న సొమ్మును తమకు అప్పగించాలని కోరుతోంది. ఇందుకుగాను ఆదాయం పన్ను శాఖ కోర్టును ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications