వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈడికి పత్రాలు సమర్పించిన వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)కి తన ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను సమర్పించారు. జగన్ తరఫున జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి ఈడికి పత్రాలను సమర్పించారు. మనీలాండరింగ్ కేసులో జగన్ ఈడికిక ఆ పత్రాలను సమర్పించారు. పత్రాలను సమర్పించడానికి, తాము వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పవర్ ఆఫ్ అటార్నీ గల ప్రతినిధిని తమ వద్దకు పంపాలని ఈడి జగన్‌కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఎప్పుడు పిలిచినా తాము హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నామని విజయసాయి రెడ్డి ఈడి అధికారులకు చెప్పారు. మరిన్ని పత్రాలను తాము అడిగే అవకాశం ఉందని ఈడి వర్గాలు చెప్పాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణపై ఈడి జగన్‌పై కేసు నమోదు చేసింది.ట ఆర్థిక లావాదేవీల్లో, పెట్టుబడుల్లో విదేశీ మారక ద్రవ్యం నిబంధనలను ఉల్లంఘించారా అనే విషయంపై కూడా ఈడి దృష్టి పెట్టింది.

English summary
YSR Congress chief YS Jaganmohan Reddy on Thursday submitted documents related to his finances and investments to the Enforcement Directorate which is probing alleged money laundering and for ex violations charges against him and his associates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X