సిఎం క్యాంపు ఆఫీసు వద్ద ధర్నా,మంత్రి రచ్చబండ రచ్చ

కాగా వరంగల్ పట్టణంలోని మంత్రి పాల్గొన్న రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చ అయింది. బ్యాంక్ కాలనీలోని రచ్చబండ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య పాల్గొన్నారు. స్థానిక మహిళలు మంత్రిని తమ తమ సమస్యలపై నిలదీశారు. ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని మహిళలు ఆందోళనకు దిగారు. మంత్రిని అడ్డుకునేందికు మహిళలతో పాటు పలువురు తెలంగాణవాదులు యత్నించడంతో పోలీసులు అక్కడ నుండి వారిని బయటకు ఈడ్చుకు వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు. పలువురిని అరెస్టు చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సారయ్య రచ్చబండ కార్యక్రమం కొనసాగింది.












Click it and Unblock the Notifications