మ్యాచ్ ఫిక్సింగ్:జగన్, కాంగ్రెసుపై విరుచుకుపడ్డ టిడిపి

జగన్ ఢిల్లీ వెళ్లొచ్చాక రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. జగన్ కేసు విచారణ నిర్వీర్యం అదే సమయంలో చంద్రబాబుపై వైయస్ విజయమ్మ కేసు పెట్టడం జరిగిపోయిందన్నారు. బాబుపై కేసు వేయాలని ప్రధానికి విజయమ్మ లేఖ రాశారని అనుమానం వ్యక్తం చేశారు. 1998 నుండి బాబుపై 26 కేసులు వేశారని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా పలు కేసులు వేసి ఏమీ నిరూపించలేక పోయారన్నారు. కాంగ్రెసు జగన్‌తో కలిసి కుట్ర పన్ని బాబుపై పదే పదే కేసులు వేస్తోందన్నారు. దీనిపై ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామన్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆస్తులపై హైకోర్టు ఆదేశాల మీద సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి వీరభద్ర రావు వేరుగా విజయవాడలో చెప్పారు. చంద్రబాబు ఆస్తులపై హైకోర్టు ఆదేశించిన తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌పై హైకోర్టు పూర్తి విచారణ జరపలేదని ఆయన అన్నారు. చంద్రబాబుపై వైయస్ విజయమ్మ పిటిషన్ వేయడం వెనక కాంగ్రెసు హస్తం ఉందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications