విద్యార్ధుల్ని తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్ అడ్డుకున్న యువతి..! వీడియో వైరల్..!

నీట్ సహా జాతీయ స్దాయి పోటీ పరీక్షల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ ఢిల్లీలో మొదలైన విద్యార్ధుల ఆందోళనలు క్రమంగా ఇతర నగరాలకూ పాకుతున్నాయి. ఇందులో భాగంగా ముంబైలోని శివాజీ పార్క్ వద్ద నిరసనకు దిగిన విద్యార్ధుల్ని పోలీసులు అరెస్టు చేసి తరలిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువతి కంట విద్యార్ధుల్ని తీసుకెళ్తున్న పోలీసు వాహనం పడింది. దీంతో ఆమె ఆ వాహనాన్ని ఒంటిచేత్తో అడ్డుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది

27 ఏళ్ల మోడల్ రియా అహిర్ (rhia ahir) నిన్న ముంబైలోని శివాజీ పార్క్‌లో జరిగిన నిరసన జరుగుతున్న ప్రాంతం దగ్గర నుంచి వెళ్తోంది. దాదర్‌లోని కోహినూర్ స్క్వేర్ నుండి శివాజీ పార్క్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న అహిర్‌కు.. పోలీసులు అదుపులోకి తీసుకున్న విద్యార్ధులతో నిండిన ఒక పోలీస్ వ్యాన్ కనిపించింది. ఆ దృశ్యం ఆమెను వెంటనే కలవరపెట్టింది. దీంతో విద్యార్దులు నిలబడేందుకు కూడా చోటు లేని ఆ వ్యాన్ ను ఎలాగైనా ఆపి వారిని కిందకు దించాలని రియా అనుకుంది.

Viral Video Mumbai Woman Stops Police Van Carrying Detained Protesters Says Authorities Knew They Were Wrong

ఆ వాహనం వైపు వేగంగా వెళ్లిన రియా దానికి అడ్డంగా నిలబడింది. దీంతో పోలీసులతో ఆమెకు వాగ్వాదం జరిగింది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. అహిర్ వాహనం ముందు నిలబడి ఉండగానే, పోలీసులు దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ రియా మాత్రం కదలలేదు. పోలీసులు వెనక్కి తగ్గి నిరసనకారులను విడుదల చేసే వరకు ఆమె ఆ వ్యాన్ ముందే నిలబడి ఉంది. దీంతో చేసేది లేక పోలీసులు తాము అరెస్టు చేసిన వారిని విడుదల చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Viral Video Mumbai Woman Stops Police Van Carrying Detained Protesters Says Authorities Knew They Were Wrong

వ్యాన్ లో నుంచి బయటకు దిగిన విద్యార్ధులు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ నినాదాలు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు సెలబ్రిటీలు దీన్ని ముంబై విద్యార్ధుల పోరాట పటిమగా కీర్తిస్తూ షేర్ చేస్తున్నారు. ముంబై విద్యార్ధుల సత్తాను కేంద్రం ఇప్పటికైనా గుర్తించాలని కోరుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు కొనసాగింపుగా చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనలు ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో వారిని కూడా ఆకట్టుకుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+