జననాయగన్ పబ్లిక్ టాక్.. ఆ ఒక్క మాటతో తేల్చేశారుగా!
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం 'జననాయగన్'(తెలుగు జననాయకుడు) నేడు(జులై 23) ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 స్క్రీన్లలో గ్రాండ్ గా విడుదలైంది. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజులు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం చివరి చిత్రం అని ఊహాగానాలు రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 7 నెలల సెన్సార్ ప్రక్రియ అనంతరం ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. నేడు సినిమా విడుదల కావడంతో ఆ ఉత్కంఠకు తెరపడింది.
అయితే నేడు ఉదయమే సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎక్స్ వేదికగా జననాయగన్ సినిమాకు మిశ్ర స్పందన లభిస్తోంది. సినిమా సూపర్ హిట్, అదిరిపోయిందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే.. యావరేజ్ సినిమా అంటూ మరికొంత మంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దళపతి విజయ్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోను తెరపై ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ వేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా టాక్ ఎలా ఉందనే విషయాన్ని రివ్యూలో చూద్దాం.

స్టోరీ బ్యాక్ గ్రౌండ్
మరోసారి విజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్నాడు. వెట్రి కొండన్ అనే పోలీస్ అధికారి పాత్రలో విజయ్ నటించగా.. ఆయనకు జోడీగా కాయల్(పూజా హెగ్డే) పాత్రలో నటించింది. మమితా బైజు విజయ్ పెంచిన కూతురిగా విజయలక్ష్మి(విజ్జి) పాత్రలో కనిపించింది. విజ్జిని మాఫియా డాన్ గా నటించిన బాబీ డియోల్ నుంచి రక్షించేందుకు హీరో చేసిన పోరాటమే సినిమా అసలు కథ. ఈ సినిమాలో తెలుగులో బాలయ్య నటించిన భగవంత్ కేసరి స్టోరీ నుంచి కొంత తీసుకుని.. విజయ్ ఇమేజ్ కు అనుగుణంగా మార్పులు చేసి చిత్రీకరించారు. ఈ సినిమా కథ జైలు నేపథ్యంలో ప్రారంభమై.. అక్కడ విజయ్ కు పరిచయమైన ఓ వ్యక్తి చివరి కోరిక మేరకు అతని కూతురు(మమిత బైజు)బాధ్యత తీసుకుని.. ఆమెను ఆర్మీ ఆఫీసర్ గా చేయాలనే లక్ష్యంతో కథ సాగుతుంది.
ఈ సినిమాలో విజయ్ వన్-మ్యాన్ షో అంటూ అభిమానుల నుంచి టాక్ వస్తోంది. ఆయన తన నటన, డైలాగ్స్, యాక్షన్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నట్లు అభిమానులు ట్వీట్స్ పెడుతున్నారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని రివ్యూలు ఇస్తున్నారు. ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ హైలెట్ గా నిలిచిందని పోసోటులు పెడుతున్నారు. మొత్తంగా ఇప్పటివరకు వచ్చిన టాక్ ను బట్టి చూస్తే 'జననాయగన్'(తెలుగు జననాయకుడు) ప్రేక్షకులకు వినోదాన్ని అందించే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Ithaaaaaaaaa.. TITLE CARD 💥💥💥💥💥💥
— I ᴅ ʀ ɨ ꜱ ʜ 🦁シ︎ (@IdrishVijay) July 23, 2026
Tharamaanaaa Seigeiiiii🥵🔥🔥🔥🔥🔥🔥@actorvijay #JanaNayagan
Full Feast 💥💥💥💥💥🛐 pic.twitter.com/eBetKNkq8o
Not just a title card…
— Rohini SilverScreens (@RohiniSilverScr) July 23, 2026
A title the world has been waiting to witness.
மாண்புமிகு முதலமைச்சர்
திரு. C. Joseph Vijay
This title card will be remembered forever.#jananayagan #FansFortRohini pic.twitter.com/pf1OcJjt8M
Not just a title card…
— Rohini SilverScreens (@RohiniSilverScr) July 23, 2026
A title the world has been waiting to witness.
மாண்புமிகு முதலமைச்சர்
திரு. C. Joseph Vijay
This title card will be remembered forever.#jananayagan #FansFortRohini pic.twitter.com/pf1OcJjt8M
Not just a title card…
— Rohini SilverScreens (@RohiniSilverScr) July 23, 2026
A title the world has been waiting to witness.
மாண்புமிகு முதலமைச்சர்
திரு. C. Joseph Vijay
This title card will be remembered forever.#jananayagan #FansFortRohini pic.twitter.com/pf1OcJjt8M
#JanaNayagan Mediocre 1st Half!
— Venky Reviews (@venkyreviews) July 23, 2026
The interval block is solid and the main highlight so far. Apart from that and a few template elevation scenes, the execution has been sloppy. Bobby Deol’s villain track is absurd, the VFX is poor, and the core daughter emotion feels half baked.…












Click it and Unblock the Notifications