స్పీకర్‌ను కలిసిన వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు

Nadendla manohar
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన ముగ్గురు కాంగ్రెసు శాసనసభ్యులు గురువారం శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఉదయం పూట స్పీకర్‌ను కలవగా, శివప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి సాయంత్రం కలిశారు. వారు స్పీకర్‌తో ఏం మాట్లాడారనే విషయం తెలియదు. వారెవరు కూడా మీడియాతో మాట్లాడలేదు. తన వద్ద పెండింగులో రాజీనామాలను పరిష్కరించే పనిలో స్పీకర్ పడ్డారు. డిసెంబర్ 1వ తేదీన శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా వాటిని పరిష్కరించాలని ఆయన అనుకుంటున్నారు. ఈ స్థితిలో వారు ముగ్గురు స్పీకర్‌ను కలిశారు.

సిబిఐ ఎఫ్ఐఆర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు నిరసనగా రాజీనామాలు చేసిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు ఈ ముగ్గురు ఉన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వారు రాజీనామాలు చేశారు. అయితే, జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యుల్లో కొంత మంది శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసు వైపు రావడానికి మొగ్గు చూపుతున్నారని, కాంగ్రెసు నాయకులతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ తమ రాజీనామాలను అంగీకరిస్తారనే భయం కొద్ది కాస్తా సమయం ఇవ్వాలని కోరడానికో, రాజీనామాలను ఆమోదించవద్దని చెప్పడానికో వారు స్పీకర్‌ను కలిశారనే పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+