'అవెంజర్స్ డూమ్స్ డే' ట్రైలర్ రివ్యూ ఇదే
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఈ యూనివర్స్ నుంచి వచ్చే ఒక్కో సూపర్ హీరో మూవీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కో పార్ట్ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్స్ కొళ్లగొడుతుంది. అయితే మార్వెల్ నుండి సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత భారీ మల్టీవర్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ అవెంజర్స్: డూమ్స్‌డే నుంటి అధికారిక ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ రిలీజ్ తో ఒక్కసారిగా భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18 న విడుదల కానుంది. అంటే సినిమా రిలీజ్ కు ఏకంగా ఐదు నెలల ముందే ట్రైలర్ ను విడుదల చేయడం విశేషం.
ఈ ట్రైలర్ ప్రకారం.. థోర్, ఫెంటాస్టిక్ ఫోర్, ఎక్స్-మెన్, హల్క్ పాత్రలతో 'అవెంజర్స్: డూమ్స్‌డే' మూవీ తెరకెక్కింది. మార్వెల్ స్టూడియోస్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాయి. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆసక్తిని మరింతగా రెట్టింపు చేసింది. థోర్, కెప్టెన్ అమెరికా, ఫెంటాస్టిక్ ఫోర్ సభ్యులు, బ్లాక్ పాంథర్, హల్క్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ట్రైలర్ లో డాక్టర్ డూమ్ ను చూస్తే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోనే అత్యంత శక్తివంతమైన విలన్ అని స్పష్టం అవుతోంది.

అంతేకాక గతంలో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలోని థానోస్ ను మించినోడని తెలుస్తోంది. ట్రైలర్ లో థోర్- డాక్టర్ డూమ్ మధ్య ఫైటింగ్ హైలెట్ గా నిలిచింది. థోర్ పవర్స్ ను డాక్టర్ డూమ్ కేవలం రెండు వేళ్లు పెట్టి ఆపడం ఆయన శక్తి సామర్థ్యాలకు నిదర్శనం అని తెలుస్తోంది. ఇక ఈ మూవీ డిసెంబర్ 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Doomsday arrives December 18th.
— Marvel Studios (@MarvelStudios) July 20, 2026
Experience Avengers: Doomsday on bigger, brighter, & more immersive screens. Tickets are now on sale exclusively for Infinity Vision certified theaters: https://t.co/2HHPv9pj8t pic.twitter.com/zpsrdHbpHE
భారత ప్రేక్షకుల కోసం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే.. ఇప్పటికే ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ లోనే ప్రతిష్టాత్మక హాలీవుడ్ చిత్రం 'డ్యూన్ పార్ట్ 2'.. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఫౌజీ' వంటి భారీ చిత్రాలు కూడా వస్తున్నాయి.












Click it and Unblock the Notifications