గాలి లీజులకు శ్రీలక్ష్మే ఒత్తిడి చేశారు: రాజగోపాల్

శ్రీలక్ష్మి 2007లో తనకు చాలా సార్లు ఫోన్ చేసి గాలి జనార్దన్ రెడ్డి ఫైళ్లను క్లియర్ చేయాలని ఒత్తిడి తెచ్చారని, తాను పంపిన ఇతర ఫైళ్లకు కొర్రీ పెట్టిందని ఆయన అన్నారు. తాను నిజాయితీగా పనిచేశానని, గనులను కాపాడానని, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేశానని, రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి ఏటా 300 కోట్ల రూపాయలు వచ్చేలా చేశానని ఆయన వివరించారు. సిబిఐ అధికారులు గురువారం శ్రీలక్ష్మిని తొమ్మిది గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే గాలి జనార్దన్ రెడ్డికి గనులు లీజుకు ఇచ్చినట్లు ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications