బాబు తోక పత్రికలకే చెల్లింది: ఈనాడు, జ్యోతిపై గట్టు

Gattu Ramachandra Rao
హైదరాబాద్: చట్టం, సిబిఐ విచారణ నుండి ఎవరూ తప్పించుకోలేరని కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణా రెడ్డి శుక్రవారం ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా సిబిఐ విచారణను స్వాగతించి సహకరించాలని కోరారు. ఎమ్మార్ అక్రమాలకు బీజం పడింది ఆయన హయాంలోనేననని ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని క్లీన్ చిట్ ఇచ్చుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

ఎమ్మార్ అక్రమాలు బాబు హయాంలోనే జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డియే అందుకు కారణం అని అనటం బాబు తోక పత్రికలకే చెల్లిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్రా రావు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను ఉద్దేశించి అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని అంటున్న బాబు సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఆయన ఎలాంటి తప్పు చేయనప్పుడు సిబిఐ విచారణ ఎదుర్కోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+