జగన్‌కు జయసుధ టాటా, కిరణ్ కుమార్‌పై ప్రశంసలు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తన మద్దతు ఉంటుందని, ముఖ్యమంత్రి పనితీరు బాగుందని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రిని తన నియోజకవర్గానికి అహ్వానిస్తానని ఆమె చెప్పారు. రాజీవ్ యువకిరణాలు పథకం యువతకు వరమని ఆమె కొనియాడారు. వైయస్ జగన్‌కు మద్దతు ప్రకటిస్తూ వస్తున్న శాసనసభ్యుల్లో తొలి వికెట్ అధికారికంగా పడిపోయినట్లే. వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను ముఖ్యమంత్రి సమర్థంగా అమలు చేస్తున్నారని ఆమె అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రితో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా సమావేశమయ్యారు. తాము జగన్ వెంట ఉంటూనే ప్రభుత్వానికి మద్దతిస్తామని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి చెప్పిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు మలుపు తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, జగన్ వెంట నడుస్తున్న శాసనసభ్యులు వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.












Click it and Unblock the Notifications