వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గప్‌షుప్' గా ఎస్‌ఎమ్ఎస్ మీ మొబైల్‌లోకి..

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

SMS GupShup
కమ్యూనిటీ సోషల్ మెసేజింగ్ , బిజినెస్ మెసేజ్ సేవలనందించే కంపెనీ 'ఎస్‌ఎంఎస్ గప్‌షుప్', మొబైల్ ఫోన్లలో ఉచిత మెసెంజర్(చాటింగ్) సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. జీపీఆర్‌ఎస్ సదుపాయం ఉన్న అన్ని రకాల మొబైల్స్‌లో ఈ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఇందుకోసం ఒక యూనివర్సల్ మెసెంజర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, దీనిని ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.

జీమెయిల్, యాహూ మెసెంజర్ చాటింగ్‌ల వలనే ఎస్‌ఎంఎస్ గప్‌షుప్ రూపొందించే మెసెంజర్ ద్వారా ఏ మొబైల్ ఫోన్‌తోనైనా డేటా షేరింగ్ చేసుకోవచ్చు. కంపెనీకి 5.5 కోట్ల సభ్యులున్నారని, ఇందులో 50 లక్షల కమ్యూనిటీలు ఉంటాయని అన్నారు. 25,000 చిన్నతరహా వ్యాపార సంస్థలు, 500 బడా సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయని, వీటి నుంచే వ్యాపారం సమకూరుతుందన్నారు.

భారత్‌లో నెలకు 400 కోట్ల మెసేజ్‌లను పంపుతున్నామని, ఇది మొత్తం మెసేజ్ ట్రాఫిక్‌లో 12-15 శాతానికి సమానమన్నారు. ఎస్‌ఎంఎస్‌లను నిరోధించే ట్రాయ్ నిబంధనల ప్రభావం తమపై కూడా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ రూ.250 కోట్లు సమీకరించిందని, కొత్త ప్రొడక్టుల అభివృద్ధికి, విస్తరణకు నిధులను వెచ్చిస్తున్నట్లు రవి వెల్లడించారు. ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, శ్రీలంక, గల్ఫ్ దేశాలకు విస్తరిస్తున్నామన్నారు. ఈ ఏడాది రూ.100 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నామని అన్నారు. ఈ సర్వీస్‌ని వినియోగదారులకు వచ్చే సంవత్సరం జనవరి-మార్చి మధ్యకాలంలో ప్రారంభనున్నామని అన్నారు.

English summary
SMS-based social networking service SMS GupShup is launching an upgraded version of its SMS networking service which will enable incoming messages to by-pass the SMS-inbox and appear in a separate data-box.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X