వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై తిరుగుబాటుకు ఇన్వెస్టర్లు సిద్ధం? త్వరలో నోటీసులు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

ys jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఆయనపై తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు తిరుగుబాటు బావుటా ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టిన పెట్టుబడుల పాపం తమనూ అంటుకోవడంతో వారు కొత్త వ్యూహం రచిస్తున్నారని పేర్కొంది. సాక్షి వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి ఒత్తిడి మేరకు జగతి పబ్లికేషన్స్ విలువను పెంచి చూపించామన్న డెలాయిట్ సీనియర్ డైరెక్టర్ సుదర్శన్ ఇచ్చినట్లు చెబుతున్న వాంగ్మూలమే అస్త్రంగా.. తప్పుడు నివేదికను చూపించి జగన్ తమను మోసం చేశారని, భారీ ప్రీమియంతో వాటాలు కొనిపించారని కంపెనీ లా బోర్డుకు ఫిర్యాదు చేయనున్నారని పేర్కొంది.

తమ పెట్టుబడులు తమకు వెనక్కి ఇప్పించాలని కోరనున్నారని, తప్పుడు అంచనాలు ఇచ్చిన డెలాయిట్‌కు, ఇప్పించిన జగన్‌కు కూడా నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారట. వచ్చే వారంలోనే ఈ నోటీసులు పంపించే అవకాశముంది. జగతి పబ్లికేషన్స్‌లో జగన్ పెట్టుబడి చాలా తక్కువున్నప్పటికీ ఆయన వాటా డెబ్బై శాతం కాగా, ఇతర ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెద్దమొత్తంలో ఉన్నప్పటికీ వారందరి వాటా కేవలం ముప్పై శాతం మాత్రమే ఉందని, రూ.30 విలువ చేసే షేరును రూ.350 పెట్టి కొనడమే దీనికి కారణమని పేర్కొంది. ఇంత భారీ ప్రీమియంతో వాటాలు కొనడానికి డెలాయిట్ ఇచ్చిన అంచనాలే కారణమని పైకి చెబుతున్నప్పటికీ వైఎస్ హయాంలో పొందిన మేళ్లకు ప్రతిఫలంగానే ఈ పెట్టుబడులు పెట్టినట్లు (క్విడ్ ప్రొ కొ) ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే సిబిఐ దర్యాప్తు జరుగుతోంది.

ఈ దర్యాప్తుతో ఆ కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి పెట్టుబడుల మూలాలు శోధిస్తోంది. ఒకవేళ జగన్ కంపెనీల ఖాతాలను స్తంభింపచేసి, ఆస్తులను స్వాధీనం చేసుకునే పరిస్థితే వస్తే, ఇన్వెస్టర్లు తమ సొమ్ముకు నీళ్లొదులు కోవాల్సిందే! ఇన్ని కష్టాల్లో కూరుకుపోయిన జగన్ ఇన్వెస్టర్లకు 'డెలాయిట్' సుదర్శన్ వాంగ్మూలం బ్రహ్మాస్త్రంలా దొరికిందని పేర్కొంది. డెలాయిట్ ఆకర్షణీయమైన అంచనాలతో ఇచ్చిన వాల్యుయేషన్ నివేదికను చూపించి తమ నుంచి భారీ ప్రీమియం వసూలు చేశారని, తమను వంచించారని కంపెనీ లా బోర్డుకు ఫిర్యాదు చేయాలని ఇన్వెస్టర్లు భావిస్తున్నారట. తమ సొమ్ము తాము వెనక్కి ఇప్పించాల్సిందిగా కోరనున్నారు. ఇన్వెస్టర్ల ఫిర్యాదు మేరకు కంపెనీ లా బోర్డు చర్యలు తీసుకుంటే జగన్‌కు మరిన్ని ఇక్కట్లు తప్పవు.

English summary
It seems, Investors may sent notice to YSR Congress Party president YS Jaganmohan Reddy soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X