హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడే ఓటు అడిగేందుకు మీ ముందుకు వస్తా: సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగేందుకు మీ ముందుకు వస్తానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అన్నారు. వచ్చే మూడేళ్లలో పదిహేను లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉందన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటేనే తాను ఓటు కోసం మీ ముందుకొస్తానని చెప్పారు. ఈ నెల డిసెంబరాఖరు వరకు లేదా జనవరి మొదటి వారం లోగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఉద్యోగాలు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఇప్పించి ప్రతిపక్షాల విమర్శలు తిప్పి కొడతామని చెప్పారు. ఉద్యోగాలు ఎక్కడున్నాయని ప్రతిపక్షాలు పొంతన లేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.

ఉద్యోగాలలో లంచగొండితనం, సిఫార్సులను పక్కన పెట్టి ప్రతిభకే పట్టం కడతామన్నారు. ఉద్యోగ నియామకాలు ఆలస్యం కాకుండా ఉండేందుకు గ్రూప్ 2 ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ మహిళల అభ్యున్నతి కోసం రూ.25 లక్షలతో స్త్రీ శక్తి భవనం రంగారెడ్డి జిల్లా నుండే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

English summary
CM Kiran Kumar Reddy said today that Congress government is committed on fifteen lacks employment in three years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X