వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్కామ్‌లో ఐదుగురికి సుప్రీంకోర్టు బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు బుధవారం కార్పొరేట్ సంస్థలకు చెందిన ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. యునిటెక్‌కు చెందిన సంజయ్ చంద్ర, స్వాన్ టెలికమ్‌కు చెందిన వినోద్ గోయంకా, రిలయన్స్ అదాగ్ ఎగ్జిక్యూటివ్‌లు గౌతం దోషి, హరి నాయర్, సరేంద్ర పిపారాలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులందరిపై ట్రయల్ కోర్టు అభియోగాలు మోపిన తర్వాత బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తొలి తీర్పు ఇదే.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి ఎ రాజాతో, డిఎంకె పార్లమెంటు సభ్యుడు కనిమొళితో పాటు 14 మంది నిందితులు తీహార్ జైలులో ఉన్నారు. 14 మందిపై అభియోగాలు మోపిన తర్వాత నిందితులు పెట్టుకున్న కనిమొళి, సినీయుగ్ కరీం మొరానీ, కలైంగర్ టీవి ఎఁడి శరత్ కుమార్, స్వాన్ టెలికం ప్రమోటర్ షాహిద్ బాల్వా, కుసేగావ్ ఫ్ర్యూట్స్ అండ్ వెజిటెబుల్స్ ఎగ్జిక్యూటివ్‌లు ఆసిఫ్ బాల్వా, రాజీవ్ అగర్వాల్, టెలికం మాజీ కార్యదర్శి సిద్ధార్థ్ బెహురా, రాజా మాజీ సహాయకుడు ఆర్‌కె చండోలియా బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది.

English summary
The Supreme Court on Wednesday granted bail to Unitech's Sanjay Chandra, Swan Telecom's Vinod Goenka and top Reliance ADAG executives Gautam Doshi, Hari Nair and Surendra Pipara in the 2G scam case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X