హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు కేసుపై సిబిఐని తప్పు పట్టిన సాక్షి డైలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi Daily
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పట్ల సిబిఐ అనుసరిస్తున్న వైఖరిని తప్పు పడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక బుధవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు కేసును విచారించడంలో జాప్యం చేయడాన్ని ప్రశ్నించింది. వైయస్ జగన్, చంద్రబాబు కేసుల్ోల సిబిఐ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించింది. జగన్ విషయంలో అంతులేని హడావిడి, విపరీతమైన వేగం కనబరిచిన సిబిఐ చంద్రబాబుపై కేసు విషయంలో విపరీతమైన అలసత్వం ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించింది. ఆగస్టు 10వ తేదీన హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశిస్తే 17న ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని, మధ్యలో మూడు రోజులు సెలవులొచ్చినా వేగం తగ్గించలేదని చెప్పింది.

హైకోర్టు ఆదేశించి పది రోజులు గడిచినా చంద్రబాబుపై మాత్రం విచారణ చేపట్టలేదని, రేపో మాపో విచారణంటూ అనధికార లీకులతోనే సిబిఐ సరిపెడుతోందని చెప్పింది. రెండు కేసుల్లో సిబిఐ తీరుపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించింది. జగన్ కేసులో పత్రాలు సేకరించడం వంటి పనులను పది రోజుల్లోనే పూర్తి చేసిందని సాక్షి డైలీ గుర్తు చేసింది. జగన్, బాబు కేసుల విచారణలో నాలుగు రోజుల్లోనే కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసి రంగంలోకి దిగిందని సాక్షి దినపత్రిక అన్నది.

English summary
YSR Congress president YS Jagan's Sakshi daily has blamed CBI on TDP president N Chandrababu Naidu case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X