హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఆస్తుల కేసు:తెలంగాణ ఎమ్మెల్యేలకు విప్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఖరితో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇరుకున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబు ఆస్తులపై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని ఈ నెల 30వ తేది నుండి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలలో ప్రస్తావించాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. ఆదే సమయంలో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు శాసనసభకు గైర్హాజరు కావాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో టిటిడిపి ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరైతే బాబు ఆస్తుల కేసు విషయంలో ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొందుకు సాధ్యపడదని భావిస్తున్నారు.

తెలంగాణ ఎమ్మెల్యేలు సభకు రాకుంటే కాంగ్రెసు ఎదురుదాడి చేస్తే తమకు కష్టమని భావించిన టిడిపి నాయకత్వం అందరూ సభకు హాజరయ్యేలా విప్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపి ఎమ్మెల్యేలు అందరూ సభకు హాజరు కావాలని విప్ జారీ చేసిన పక్షంలో ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి అవుతుంది. సభకు రావద్దన్న తమ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ విప్ జారీ చేస్తే తెలంగాణ టిడిపి నేతలు ఏం చేస్తారో చూడాలి.

English summary
It seems, Telugudesam Party may issued party whip to all the party mlas to attend assembly sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X