హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమావేశానికి హాజరైన వైయస్ జగన్ ఎమ్మెల్యేలు వీరే

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల భేటీకి హాజరు తగ్గింది. దాదాపు 20 మంది శాసనసభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వివిధ సాకులు చెప్పి కొంత శాసనసభ్యులు సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎవరు వస్తారో, ఎవరు రారో అనే అయోమయం నెలకొనడంతో సమావేశం ఆలస్యంగా ప్రారంభమైంది. సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. సమావేశ వేదికను కూడా జూబ్లీహిల్స్‌లోని పార్టీ కార్యాలయం నుంచి లోటస్ పాండ్‌లోని వైయస్ జగన్ నివాసానికి మార్చారు.

శాసనసభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుచరిత, బాలినేని శ్రీనివాస రెడ్డి, బాబూరావు, ప్రసాద రాజు, శోభా నాగిరెడ్డి, పూతల పట్ట రవి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, బాలరాజు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, కొండా సురేఖ ఈ సమావేశానికి హాజరయ్యారు. అమెరికాకు వెళ్లడంతో తాను సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. మొత్తం 8 మంది శాసనసభ్యులు సమావేశానికి డుమ్మా కొట్టారు. కొర్ల భారతి, శేషారెడ్డి, కుంజా సత్యవతి, జయసుధ జగన్‌కు దూరమయ్యారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్యక్రమాలు ఉండడంతో తాను రాలేకపోతున్నట్లు ఖమ్మం జిల్లాకు చెందిన కుంజా సత్యవతి చెప్పారు. శానససభా సభ్యత్వానికి చేసిన రాజీనామాను ఆమోదించుకున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడాసమావేశానికి రావాల్సి ఉంది. తనకు నియోజకవర్గంలో పనులు ఉండడం వల్ల రాలేకపోతున్నట్లు తెలుగుదేశం శానససభ్యుడు బాలనాగిరెడ్డి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు శానససభ్యురాలు వైయస్ విజయమ్మ బెంగళూర్ వెళ్లడం వల్ల రాలేకపోయారు.

English summary
About dozen MLAs attended YSR Congress party president YS Jagan camp meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X