కొడుకు మరణవార్తతో కుప్పకూలిన కిషన్‌జీ తల్లి

Kishenji
కరీంనగర్: తన కుమారుడి మరణవార్త వినగానే మావోయిస్టు నేత కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర రావు తల్లి మధురమ్మ కుప్పకూలిపోయింది. కిషన్‌జీ స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో గల కిషన్‌జీ నివాసానికి అభిమానులు, మిత్రులు, బంధువులు గురువారం రాత్రే పెద్ద యెత్తున తరలి వచ్చారు. కిషన్‌జీ అజ్ఞాతంలోకి వెళ్లినప్పటి నుంచి తల్లికి కనిపించలేదు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతూ 1975లో అజ్ఞాతంలోకి వెళ్లిన కిషన్‌జీకి ఇప్పుడు 55 ఏళ్లు. అతను 1974లో రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ఎస్‌యు)లో చేరాడు. కిషన్‌జీ మృతదేహాన్ని తమకు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కిషన్‌జీ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. అంత్యక్రియల కోసం కిషన్‌జీ మృతదేహాన్ని తమకు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కిషన్‌జీ మరణవార్త వినగానే విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఏడ్చేశారు. కిషన్‌జీ మృతదేహం కోసం ఆయన కోల్‌కతా బయలుదేరి వెళ్లారు. కిషన్‌జీ 1953 అక్టోబర్ 10వ తేదీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఉస్మానియా ఆస్పత్రి నుంచి 1984లో అప్పటి పీపుల్స్‌వార్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్యను తప్పించడంలో కిషన్‌జీ ప్రధాన పాత్ర పోషించాడని అంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+