కిషన్‌జీని మమతా బెనర్జీ చంపేసింది: వరవరరావు

Varavara Rao
కోల్‌కతా: మావోయిస్టు నేత కిషన్‌జీది బూటకపు ఎన్‌కౌంటర్ అని, దీనికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీదే బాధ్యత అని విప్లవ రచయితల సంఘం (విరసం) వరవర రావు విమర్శించారు. 1991నుంచి తాను కిషన్‌జీని పలుమార్లు చూశానని, గత 43 ఏళ్లలో తాను చాలా మృతదేహాలు చూశానని, ఇలాంటి మృతదేహాన్ని ఇప్పటి వరకు చూడలేదని ఆయన అన్నారు. కిషన్‌జీని కోశారని, కాల్చివేశారని, ఆ తర్వాత శరీరంలోకి బుల్లెట్లు కాల్చారని ఆయన ఆరోపించారు. శరీరమంతా గాయాలే ఉన్నాయని, 24 గంటల పాటు కస్టడీలో ఉంచుకుని వేధించారని ఆయన ఆరోపించారు. మృతదేహాన్ని గుర్తించడానికి ఆయన కిషన్‌జీ సోదరుడి కూతురు దీపారావుతో కలిసి మిడ్నాపూర్ వచ్చారు.

శాంతిని కోరిన కిషన్‌జీని మమతా బెనర్జీ చంపారని ఆయన మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. కిషన్‌జీ మృతదేహానికి మిడ్నాపూర్‌ వైద్య కళాశాల, ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లోనే మరణించాడని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. కిషన్‌జీ మృతదేహంపై 20 చోట్ల గాయాలున్నాయని వారు చెప్పారు. కిషన్‌జీ మృతదేహాన్ని మిడ్నాపూర్ నుంచి హైదరాబాదు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాదు నుంచి ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి తరలిస్తారు. కాగా, కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు రెండు రోజుల పశ్చిమ బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+